కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కం యాక్టర్, ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్.. ప్రముఖ మలయాళ నటి, సూపర్ హిట్ ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 28న ఈ పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘బూమ్ బూమ్’ అంటూ సాగే ఈ సాంగ్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ట్రెండీ అండ్ స్టెలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
కాగా డ్యూడ్ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























