ఖైదీతో సెన్సేషన్ సృష్టించి తరువాత విక్రమ్ , లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.లియో తరువాత లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశాడు. కేవలం కాంబినేషన్ తో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా నిన్నటివరకు 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే కోలీవుడ్ కి కూలీ ఫస్ట్ 1000కోట్ల సినిమా అవుతందని రిలీజ్ కు ముందు సినీ విశ్లేషకులు అంచనా వేసినా ఆ రేంజ్ రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత లోకేష్, కార్తీ తో ఖైదీ 2 చేయాల్సివుంది. కానీ ఇప్పుడు ఆసినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశాడు. ఈ గ్యాప్ లో లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడట.అందులో భాగంగా రజినీకాంత్ , కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను తెరపై కలిపే ఆలోచనలో ఉన్నాడని టాక్. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం దాదాపు అరుదైన విషయం.
ఇప్పటికే కమల్ హాసన్‌తో విక్రమ్ అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన లోకేష్, రజినీకాంత్‌తో కూలీ చేశాడు. ఈ ఇద్దరితో వేర్వేరుగా పనిచేసిన తర్వాత, ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్‌లో వీరిని కలిపే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా యాక్షన్-థ్రిల్లర్ జానర్‌లో ఉండే అవకాశం ఉందని, కథపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం.ఈ నెలలోనే అనౌన్స్ మెంట్ కూడా రానుందని కోలీవుడ్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సన్ పిక్చర్స్ అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉందని టాక్.సినిమా సెట్ అయితే 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.త్వరలోనే ఈసినిమా విషయంలో ఓ క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























