ఘాటి సెకండ్ సింగిల్ ‘దస్సోరా’ రిలీజ్

Ghaati Second Single Dassora Released

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ ‘సైలోరే’ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్ర యూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. ఇ.ఎస్ మూర్తి సాహిత్యం సమకూర్చిన ఈ పాటను గాయకులు గీతా మాధురి, శృతి రంజని, సాకేత్ కొమండూరి మధురంగా ఆలపించారు. సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి ఈ సాంగ్ కి అద్భుతమైన ట్యూన్ అందించాడు. ఫస్ట్ సాంగ్ వలే ఇది కూడా మ్యూజిక్‌ ప్రియులను అలరించేలావుంది. మ్యూజిక్, విజువల్స్, లిరిక్స్ అన్నీ కలిసి పాటను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

చారిత్రాత్మకమైన కథా నేపథ్యం, అద్భుతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను విభిన్నమైన ప్రయాణంలోకి తీసుకువెళ్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అనుష్క శెట్టి కొత్త లుక్‌లో కనిపించబోతుండటం, క్రిష్ దర్శకత్వం, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మక నిర్మాణం కలిసినప్పుడు మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క – విక్రమ్ ప్రభు కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కానుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.