రేపే పరదా స్పెషల్ ప్రీమియర్స్, బుకింగ్స్ ఓపెన్

Paradha Special Premieres in AMB and AAA Cinemas Tomorrow, Bookings Open

ట్యాలెంటెడ్ డైరెక్టర్, ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్శించనున్నారు. ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. సోషల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా సినిమా తెలుగు, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా మేకర్స్ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరదా మూవీ స్పెషల్ ప్రీమియర్లు ఏర్పాటుచేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలు రేపు ఏఎంబీ సినిమాస్ మరియు ఏఎఏ సినిమాస్‌లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్‌డ్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఏ మేరకు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇక పరదా ప్రీమియర్ షోల కోసం ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శితమయ్యే ఈ షోలు సినిమాకు తొలి స్పందనను అందించనున్నాయి. కాగా ఈ సినిమా స్త్రీ శక్తిని, సాధికారతను, సామాజిక సందేశాన్ని అందంగా మరియు శక్తివంతంగా ప్రేక్షకులకు అందించనుందని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత కృష్ణ మరియు రాగ్ మయూర్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కథను ప్రహాస్ బొప్పూడి, పూజిత శ్రీకాంత్ మరియు ప్రవీణ్ కాండ్రేగుల సంయుక్తంగా రచించారు. ఈ చిత్రం యువత ఎదుర్కొనే సామాజిక సమస్యలను, మనసును కదిలించే భావోద్వేగాలను పక్కా వాస్తవికంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హోం బ్యానర్ ‘వేఫేరర్ ఫిల్మ్స్’ ఈ మూవీ మలయాళ పంపిణీ హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. దీంతో ఈ సినిమాపై ఇటు తెలుగులోనే కాకుండా అటు మలయాళంలోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.