వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోన్న లేటెస్ట్ హిందీ మూవీ ‘థామా’. ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో హారర్-కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ వంటి అగ్ర నటీనటులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో టీజర్ విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థామా టీజర్‌లో రష్మిక ఒక విభిన్నమైన, పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తోంది. ఇది ఒక రొమాంటిక్-హారర్ కథాంశం అని టీజర్ స్పష్టం చేస్తోంది. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠ కలిగించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మ్యాడ్ డాక్ సూపర్ నేచురల్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన బ్లాక్ బస్టర్స్ ‘స్త్రీ, ముంజియా’ చిత్రాల తరహాలోనే థామా కూడా రూపొందుతోంది.
దీంతో థామా టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది. విడుదలైన కొన్ని నిమిషాలకే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక లుక్‌పై, ఆమె పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమెను ఇంతవరకు చూడని ఒక కొత్త అవతార్‌లో చూపించడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, థామా టీజర్‌తో రష్మిక బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























