బాహుబలి రీ-రిలీజ్ వేళ.. రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ

Pan India Rebel Star Prabhas' Special Interview Ahead of Baahubali The Epic Release

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఇది ఆయన కెరీర్ లోనే కాకుండా, భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంతోపాటు స్థాయిని కూడా పెంచిన చిత్రంగా ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ కేవలం స్థానిక భాషలలోనే రూపొందే చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కేలా చేసింది. అలాగే ఈ సినిమా సీక్వెల్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే అత్యధిక వసూళ్లతో సంచలనమే సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. బాహుబలి పార్ట్ 1 విడుదలై ఈ ఏడాదితో పదేళ్లు అవుతున్న సందర్భంగా.. మేకర్స్ సరికొత్త ప్రయత్నంతో రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో సుదీర్ఘ రన్‌టైమ్‌తో ఒకే సినిమాగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందు, హీరో ప్రభాస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను, సినిమా కోసం పడిన కష్టాలను పంచుకున్నారు. అలాగే రాజమౌళితో కలిసి పనిచేయడం, తన జీవితంలో ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించడం వంటి అంశాలపై ఆయన స్పందించారు. కాగా ఈ ఇంటర్వ్యూ, అభిమానుల్లోనే కాకుండా యావత్ సినీ ప్రపంచంలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ త్వరలోనే ప్రసారం కానుంది.

కాగా బాహుబలి సిరీస్ చిత్రాలలో రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, రోహిణి, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందించగా, సెంథిల్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఆర్కా మీడియా బ్యానర్‌పై నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తొలిభాగం దాదాపు రూ.650 కోట్లు అందుకోగా.. రెండో భాగం రూ.1850 వరకు వసూళ్ళు సాధించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.