71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN, సింగర్ PVSN రోహిత్, భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి సత్కరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సత్కార కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమం కళాకారులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు.
ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “జాతీయ స్థాయిలో తెలంగాణ కళాకారులు అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణం. ఇది మన సినిమా పరిశ్రమకు దక్కిన గొప్ప గౌరవం. తెలంగాణలో ప్రతిభకు కొదవ లేదు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారికి అండగా నిలబడటం మా ప్రభుత్వ కర్తవ్యం. యువ దర్శకులు, నటులు కొత్త కథాంశాలతో ముందుకు రావాలి. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహిస్తుంది” అని హామీ ఇచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























