లెజండరీ యాక్టర్, దివగంత కోట శ్రీనివాసరావు ఇంట మరో తీవ్ర విషాదం నెలకొంది.గత నెల 13న అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.ఇక ఆయన సతీమణి కోట రుక్మిణి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు.గత కొంత కాలంగాఆమె అనారోగ్యంతో బాధ పడుతుండగా ఇటీవల కోట శ్రీనివాసరావు మరణించాక ఆమె ఆరోగ్యం మరింత క్షిణించింది.ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య కూడా తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు సమాచారం.కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం కాగా 2010లో కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.ఆ విషాదం నుండి కోట శ్రీనివాసరావు దంపతులు కోలుకోలేకపోయారు.
ఇక ఇప్పుడు కోట శ్రీనివాసరావు తరువాత కోట రుక్మిణి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కోట రుక్మిణి మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























