‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్

Natu Natu Song Singer Rahul Sipligunj's Engaged With Harini Reddy

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై తెలుగు పాటను సగర్వంగా ఆలపించిన ప్రముఖ గాయకుడు, ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాహుల్ తాజాగా హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఆయన దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌క‌పోవడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఫొటోలలో రాహుల్, హరిణి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాహుల్ కనిపించగా, ఆరెంజ్ కలర్ లెహంగాలో హ‌రిణి మెరిసింది. ఇక ఈ జంటని చూసిన వారంతా కూడా చూడముచ్చటగా ఉందంటున్నారు. అయితే వీరి వివాహం ఎప్పుడు అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కాగా ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.