సెన్సార్ పూర్తిచేసుకున్న పరదా

Paradha Censored With UA Certificate

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రల్లో నటించగా.. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్ 22న పరదా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా పరదా మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇక ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అనుపమ నటిస్తున్న మూవీ కావడంతో పరదాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.