‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్ 22న పరదా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్రలో నటించిన నటి దర్శన రాజేంద్రన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. పరదా చాలా స్పెషల్ ఫిలిం. ఆగస్టు 22న తప్పకుండా ఈ సినిమా చూడండి. ఒక మ్యాజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అనుపమ స్క్రీన్‌పై గ్రేట్ మ్యాజిక్ చేస్తుంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.” అని అన్నారు.
అలాగే నటుడు రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘సినిమా బండి’తో నన్ను అందరికీ పరిచయం చేసిన ప్రవీణ్‌కి ముందుగా థాంక్యూ. ‘పరదా’లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. విమెన్ పవర్ చూపించే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అనుపమ గారితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ చూసి మీరు కూడా లవ్‌లో పడతారు. దర్శన నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. ఫైనల్‌గా పర్ఫెక్ట్ ఫిలింతో తెలుగులోకి వస్తుంది. ఆగస్టు 22 సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుంది.” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























