డైరెక్టర్ వెంకీ అట్లూరి,కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సూర్యకి ఇది 46వ సినిమా.సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నారట.ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ వియంలో ఓ క్లారిటీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు కొట్టి సూపర్ ఫామ్ లో వున్న వెంకీ అట్లూరి నుండి వస్తున్న సినిమా కావడంతో సూర్య 46 పై భారీ అంచనాలు వున్నాయి.సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక సూర్య ఈసినిమా కన్నా ముందు తన 45వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంటుంది.ప్రముఖ నటుడు, కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.కుదిరితే ఈఏడాది చివర్లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























