సుధీర్ బాబు ‘జటాధర’ టీజర్ వస్తోంది

Sudheer Babu's Jatadhara Teaser Update

గతేడాది ‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఏడాది ప్రారంభంలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌ ఆకట్టుకోగా, ఆ తర్వాత మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాని పరిచయం చేస్తూ విడుదల చేసిన మరో పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 8న టీజర్ రిలీజ్ కానున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యం కానుంది. శివన్ నారంగ్‌, ప్రేర్నా అరోరా, నిఖిల్‌ నందా, ఉజ్వల్ ఆనంద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.