జపాన్‌లో రిలీజ్ వేళ.. ‘మనం’పై చైతూ స్పెషల్ ట్వీట్

Naga Chaitanya Special Tweet on Manam Ahead of Release in Japan

అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘మనం’. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించడం విశేషం. తెలుగులో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో మనం సినిమా ఒకటి. అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ త్వరలో జపాన్‌లో విడుదల కానుండటం గమనార్హం. ఇది తెలుగు సినీ ప్రేమికులకు ఎంతో గర్వకారణంగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాగచైతన్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా ‘మనం’. మా కుటుంబమంతా కలిసి చేసిన ఈ ప్రయాణం, నా హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు అది జపాన్ ప్రేక్షకులను చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆగస్టు 8న జపాన్‌లో థియేటర్లలో విడుదల కానుంది” అంటూ ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నాడు చైతూ.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే తెరపై చూపించిన అరుదైన ప్రయత్నంగా నిలిచింది. ‘మనం’లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, శ్రియ మరియు సమంత కీలక పాత్రల్లో నటించారు. సెన్సిబుల్ ఎమోషన్స్, రిచ్ టెక్నికల్ వేల్యూస్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ జపాన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.