కొడుకు పేరు చెప్పేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Names His Son Hanu Abbavaram

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసినదే. గత కొన్నిరోజుల క్రితం ఆయన భార్య, నటి రహస్య ఘోరక్ పండంటి మగ బాబు జన్మనిచ్చారు. దీంతో వారి కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ అబ్బవరం దంపతులు ఈరోజు పవిత్ర తిరుమలలో తనయుడికి నామకరణం నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతరం కిరణ్ అబ్బవరం తన కొడుకు పేరు ప్రకటించారు. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా హృదయాన్ని తాకే పోస్టుతో తన కొడుకు పేరును వెల్లడించారు. తనయుడికి ‘హను అబ్బవరం’ అనే పేరుని పెట్టినట్టు తెలిపారు. “హనుమంతుడు మరియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేము ఈరోజు తిరుమలలో మా కొడుకుకు ఈ పేరు పెట్టాము” అంటూ తండ్రిగా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.

ఇక ఈ శుభ తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు మరియు ఆయన ఫ్యాన్స్ కిరణ్ అబ్బవరానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, వ్యక్తిగత జీవితంలో కూడా ముద్దుబిడ్డతో కొత్త ప్రయాణం ప్రారంభించినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కిరణ్ ప్రస్తుతం.. ‘కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ’ అనే రెండు సినిమాలలో నటిన్నాడు. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.