యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2” ట్రైలర్ ఇటీవలే విడుదలై సందడి చేసింది. స్టన్నింగ్ విజువల్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎన్టీఆర్ – హృతిక్ మధ్య చుక్కలు చూపించే క్లాష్ ట్రైలర్లో చూపించడమే కాకుండా ప్రేక్షకుల మనసుల్లో గూస్బంప్స్ కలిగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్షన్ లుక్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్ దీనిపై ఎక్స్‌లో స్పందిస్తూ.. “వార్ 2 ట్రైలర్‌పై మీకున్న ప్రేమ మాకు ప్రపంచం లాంటిది.. ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. అలాగే మరో హీరో హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. “మీ అందరి స్పందనను చూసి నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ‘వార్ 2’ మీ అందరికీ మంచి అనుభూతిని ఇవ్వాలనేది మా టీమ్ లక్ష్యం. మీ ప్రేమ, మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకంటే చాలా భిన్నంగా, ఇంటెన్స్‌గా ఉండబోతుందని ట్రైలర్‌నే చెప్పేస్తోంది. తెలుగు, హిందీ సహా అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఇక ఇప్పటికే యశ్ రాజ్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా వస్తున్న ఈ సినిమా పట్ల దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. యాక్షన్, ఇమోషన్, దేశభక్తి — అన్నిటినీ సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























