పాపులర్ తెలుగు టీవీ షో ‘జబర్దస్త్’ ద్వారా పరిచయమైనా అనేకమంది నటీనటులలో కొంతమంది సినీరంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది నటననే ఎంచుకుంటే, మరికొంతమంది దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి, ధనరాజ్ వంటివారు డైరెక్టర్లుగా సినిమాలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ కోవలోనే మరో నటుడు అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటుడు సముద్రఖని ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఆయన సరసన సీనియర్ నటి అభిరామి నటిస్తున్నారు. ఈ చిత్రం కామాఖ్య అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్‌ను తాజాగా ప్రకటించారు.
కాగా ఈ చిత్రానికి కామాఖ్య అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. డివైన్ వైబ్‌తో వున్న టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి గ్యాని సంగీతం సమకూరుస్తుండగా.. రమేష్ కుశేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. ఇక యూనిక్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























