కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి.కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా దీపావళికి రానుందని ముందే చెప్పేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రదీప్ నటిస్తున్న మరో సినిమా ఎల్ఐకె సెప్టెంబర్ 18న విడుదల కానుండడంతో డ్యూడ్ వాయిదా పడనుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వచ్చాయి.అయితే మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.ఈరోజు ప్రదీప్ బర్త్ డే కావడంతో డ్యూడ్ నుండి పోస్టర్ ను రిలీజ్ చేసి దీపావళికి రిలీజ్ కానుందని చెప్పేశారు.సో డ్యూడ్ చెప్పిన తేదీకే రానుంది.
ఇక ప్రదీప్ ప్రస్తుతం ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కూడా చేస్తున్నాడు.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.ఆగస్టు 1న ఈసినిమా నుండి గ్లింప్స్ రానుంది.
ఈసినిమా కూడా హిట్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.ప్రదీప్ రెండేళ్ల క్రితం లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టగా రీసెంట్ గా డ్రాగన్ తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఈరెండు సినిమాలు 100 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకున్నాయి.మరి ఎల్ఐకె తో హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























