చాలా గ్యాప్ తరువాత హీరో నారా రోహిత్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా ఈహీరో ప్రతినిధి 2 తరువాత రీసెంట్ గా భైరవంతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా యావరేజ్ అనిపించుకుంది.ఇందులో రోహిత్ తోపాటు మంచు మనోజ్ ,సాయి శ్రీనివాస్ హీరోలు గా నటించారు. రిజల్ట్ ఎలా వున్న నారా రోహిత్ యాక్టింగ్ మాత్రం పేరొచ్చింది.ఇక ఈసినిమా తరువాత నారా రోహిత్ సోలో హీరోగా సుందరకాండతో రానున్నాడు.ఈరోజు రోహిత్ బర్త్ డే కావడంతో రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 27 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసందర్భంగా స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యారేజ్ ఏజ్ దాటినా… హీరో ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయే వైఫ్ గా రావాలని అనుకుంటాడు.ఈ క్రమంలో అమ్మాయిని వెతికి పేరెంట్స్ కూడా విసిగిపోతారు.మరి ఈ పరిస్థితుల్లోచివరికి హీరో అనుకున్నది సాధించాడా లేదా అనే సబ్జెక్టు తో వస్తుంది ఈసినిమా.ఇందులో వృతి వాఘని,ఈశ్వర్ ఫేమ్ శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్లు గా నటిస్తుండగా నరేష్,వాసుకి ఆనంద్,సత్య,అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా రోహన్ చిల్లాలే ఎడిటర్, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























