దేశం గర్వించ దగ్గ సినిమాలు బాహుబలి 1& 2 రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా బుక్ మై షో లో అరుదైన రికార్డు సృష్టించింది. 2 వారాలకే ఈసినిమాకు లక్ష ఇంట్రెస్ట్ లు వచ్చాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి ది ఎపిక్ ఘనత సాధించింది.సో ఈసినిమా రీ రిలీజ్ క్రేజ్ ఎలా వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రన్ టైం ను లాక్ చేసే పనిలో వున్నారు మేకర్స్.3 గంటల 30 నిమిషాల లోపు రన్ టైం ఉండేలా సెట్ చేయనున్నారు.క్రేజ్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది.దాదాపు 50 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ లేకపోలేదు.
10 ఏళ్ళ క్రితం థియేటర్లలోకి వచ్చిన బాహుబలి 1 ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది.ఈసినిమా దాదాపు 650 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఇక రెండేళ్ల తరువాత సీక్వెల్ బాహుబలి 2 ఊహకందని విధ్వసం సృష్టించింది.పార్ట్ 2 అయితే ఏకంగా 1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.
అగ్ర దర్శకుడు రాజమౌళి ఈసినిమాలను డైరెక్ట్ చేయగా రెబల్ స్టార్ ప్రభాస్ ,రానా ,అనుష్క ,రమ్యకృష్ణ ,నాజర్ తదితరులు నటించారు.కీరవాణి సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా నిర్మించింది.ఈసినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























