ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. రాజమౌళి గారితో మైల్ స్టోన్ మూవీస్ చేసిన అదృష్టం నాకు దొరికింది. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను చేయడానికి కారణం నిర్మాత సాయి గారు. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కిరీటి చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్. డాన్స్, పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఇంత డెడికేషన్ ఉన్న యాక్టర్‌ని నా కెరియర్లో చూడలేదు. కాళ్ల నుంచి రక్తం వస్తున్నా పర్ఫెక్షన్ కోసం 200 టేకులు చేసాడు. తప్పకుండా తను ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు. రాధాకృష్ణ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. జులై 18న అందరూ థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























