గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తో రానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. ఫ్యాన్స్ కూడా అప్డేట్ కోసంఎదురుచూస్తున్నారు.ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.త్వరలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ కు ఇంకా 50రోజులు మాత్రమే ఉండగా ఈ సందర్భంగా మేకర్స్ 50 డేస్ టు గో పోస్టర్ ను రిలీజ్ చేసి అప్ డేట్స్ రానున్నాయి ప్రకటించారు. మురగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియారిలీజ్ కానుంది.ఈసినిమా విజయం ఏఆర్ మురగదాస్ కెరీర్ కి కీలకం కానుంది.గత కొంత కాలంగా సరైన విజయం లేక బాగా వెనుకపడిపోయాడు ఈ డైరెక్టర్.రీసెంట్ గా సికందర్ తో కూడా విజయాన్నిఅందుకోలేకపోయాడు.మరి మదరాసి తోనైనా మురగదాస్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం తన 25వ సినిమా పరాశక్తి లో నటిస్తున్నాడు.సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























