ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవడం విశేషం. ఇక మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది చాలా లవ్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. సాయి గారు చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. డైరెక్టర్ రాధాకృష్ణ గారు చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా తర్వాత ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ సినిమాకి అద్భుతమైన మాటలు లిరిక్స్ రాశారు. శ్రీమణి కూడా ఇందులో మరో అద్భుతమైన పాట రాశారు.”
“సెంథిల్ గారు ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ లాంటి అద్భుతమైన సినిమాలో తీసిన కెమెరామెన్. అయితే ఒక కొత్త కుర్రోడుతో సినిమా చేస్తున్నప్పుడు కూడా అదే ప్యాషన్‌తో వర్క్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. పీటర్ మాస్టారు చాలా అద్భుతమైన యాక్షన్ కంపోజ్ చేశారు. హాసిని వెల్కమ్ బ్యాక్. జెనీలియా గారిని మళ్ళీ తెరపై చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. వైరల్ సాంగ్ అదరగొట్టారు.”
“కిరీటి చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. మీరందరూ థ్రిల్ అవుతారు. అంత అద్భుతంగా యాక్షన్ పెర్ఫార్మ్ చేశాడు. డాన్సులు ఇరగదీసాడు. తనను చూస్తే ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ కలగలేదు. కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి ఆర్య సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో కిరీటికి జూనియర్ సినిమా అలాంటి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మీరందరూ థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తారు.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























