కూలీ నుండి మోనికా రానుంది 

coolie second single monica releasing on july 11

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్  డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు  500 కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్  కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట చీకిటు రిలీజ్ అవ్వగా అనుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ మోనికా  రానుంది.పూజా హెగ్డే పై ఈసాంగ్ ను చిత్రీకరించారు.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈసినిమా ఆడియో పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.మరి సెకండ్ సింగిల్ అయినా చార్ట్ బస్టర్ అవుతుందో చూడాలి.ఈనెల 11న సాయంత్రం 6 గంటలకు ఈ మోనికా సాంగ్ రిలీజ్ కానుంది. 

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సత్య రాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.అయితే ఈసినిమాకు హిందీ,తెలుగులో వార్ 2తో పోటీ ఎదురుకానుంది.ఈరెండు సినిమాలు ఆగస్టు 14నే రిలీజ్ కానున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.