ప్రేమలుతో సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మామితా బైజు.ప్రస్తుతం 4 సినిమాలు చేస్తుంది.ఇందులో తెలుగు తోపాటు తమిళ సినిమాలు వున్నాయి.ఇక తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ సినిమాను విగ్నేష్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో హీరోయిన్ గా మామితా బైజును తీసుకున్నారు.రేపు ఈసినిమా లాంఛ్ కానుంది.ఇందులో మలయాళ నటులు సూరజ్ వెంజరాముడు ,జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈసినిమాను వేల్స్ ఫిలిమ్ ఇంటెర్నేషల్ నిర్మిస్తుంది.ఈసినిమాను 90 రోజుల్లో ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.రేపు మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక మామితా బైజు ప్రస్తుతం మరో నాలుగు సినిమాలు చేస్తుంది.అందులో సూర్య 46ఒకటి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా సూర్య సరసన మమితా నటిస్తుంది. అలాగే తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న జన నాయగన్ లో మమితా విజయ్ చెల్లెళ్లుగా కనిపించనుంది.వీటితోపాటు ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ లో అలాగే విష్ణు విశాల్ తో ఇరుందు వానం సినిమాలు కూడా చేస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























