ది ప్యారడైజ్ షూట్ అప్డేట్ 

The action scenes for the Paradise are being filmed at the RFC location

నిర్మాతగా కోర్ట్ అలాగే హీరోగా హిట్ 3 సినిమాలతో ఈ ఏడాది వరుస సక్సెస్ లను చూసిన నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది ప్యారడైజ్.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా నాని ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.రీసెంట్ గానే నాని ఈషూట్ లో జాయిన్ అయ్యాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది.స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు.ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ కానుంది.  

టాప్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.పాన్ ఇండియా రిలీజ్ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్ లలో కూడా విడుదలకానుంది.ఇక ఇంతకుముందు నాని -శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో నాని మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు ఇదే  కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.