హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యాక్ట్రెస్ దేవయాని మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ సినిమాకి అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. చాలా గొప్ప రివ్యూస్ వచ్చాయి. సినిమాని మరో లెవల్‌కి తీసుకువెళ్లారు. మంచి సినిమాని తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో మీడియా వారందరికీ కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”
“మీరందరూ మా గృహప్రవేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). విశ్వ గారు ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. శ్రీ గణేష్ అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు. మా అబ్బాయి సిద్ధార్థ ఎక్స్‌లెంట్ పెర్ఫార్మర్. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఈ సినిమాతో మా అబ్బాయి సిద్ధార్థ వచ్చాడు (నవ్వుతూ). ప్రభు పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ” అని అన్నారు.
అలాగే యాక్ట్రెస్ చైత్ర మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమా చూసిన అందరికీ థాంక్యు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సిద్ధార్థ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























