హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీడియా నుంచి చాలా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. రివ్యూలు చదివినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా గొప్పగా కనెక్ట్ అయింది. నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం .రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఇలా అందరు దర్శకుల వర్క్ నాకు ఇష్టం. వాళ్ళందరి నుంచి నేను స్ఫూర్తిని పొందాను. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా టీమ్ అందరికీ థాంక్యూ .చంద్రబోస్ గారు అద్భుతమైన పాట ఇచ్చారు. రాకేందు మౌళి తెలుగులో చాలా అద్భుతమైన మాటలు రాశారు. మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ. సినిమాని చాలా గొప్పగా రిలీజ్ చేశారు. సినిమా గ్రాండ్‌గా రీచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ‘జెర్సీ’ సినిమా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సందర్భంగా నాని గారికి డైరెక్టర్ గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























