సరిగమ చేతికి ఇడ్లీ కడై 

Idly Kadai audio rights bagged by saregama south

వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు లేదా మూడు రిలీజ్ లు ఉండేలా చూసుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్.రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా అక్టోబర్ లో ఇడ్లీ కడై తో రానున్నాడు.ఈసినిమాలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ సౌత్ దక్కించుకుంది. వచ్చే వారంలో మొదటి పాట రిలీజ్ కానుంది.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ధనుష్ నిర్మిస్తున్నాడు.అక్టోబర్ 1న ఈసినిమా రిలీజ్ కానుంది. అయితే ఈసినిమా రిలీజ్ అయ్యేకా సరిగ్గా ఒక్క రోజు తరువాత కాంతారా చాప్టర్ 2 రిలీజ్ కానుంది.దాంతో మిగితా భాషల్లో బాక్సాఫీస్ వద్ద ఇడ్లీ కడై కి భారీ పోటీ ఎదురుకానుంది. 

ఇక  ధనుష్  నెక్స్ట్ విగ్నేష్ రాజా డైరెక్షన్ లో సినిమా చేయనుకున్నాడు.ఈసినిమా కోసం ప్రేమలు ఫేమ్ మామితా బైజు ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కనుంది.ప్రముఖ బ్యానర్ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించనుంది.కేవలం 90రోజుల్లో ఈసినిమా పూర్తి చేయనున్నారట.త్వరలోనే  ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.