బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ హీరోలుగా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్‌గా వచ్చింది.ఈసినిమా మే 30న థియేటర్లలోకి రాగా పర్వాలేదనిపించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 18 నుండి జీ5 స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు.ఈసినిమాతో సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా వారికి కం బ్యాక్ ఇవ్వలేకపోయింది.
ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు, కిష్కింధపురి, హైందవ సినిమాలు చేస్తున్నాడు. మంచు మనోజ్ మిరాయ్ లో నటిస్తున్నాడు.ఇందులో తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా, మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.సెప్టెంబర్ 5న విడుదల కానుంది.ఇక నారా రోహిత్ సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు.త్వరలోనే రిలీజ్ కానుంది
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























