8 వసంతాలు.. రెండో టీజర్ వస్తోంది

8 Vasantalu Teaser 2 Release Date Fix

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌, శుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్‌తో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను ఓవర్సీస్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ రిలీజ్ చేస్తోంది. అలాగే విడుదలకు ఒకరోజు ముందు జూన్ 19న అమెరికాలో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. 8 వసంతాలు నుంచి రెండో టీజర్ రానుంది. జూన్ 7న సెకండ్ టీజర్ విడుదలకానుంది.

ఇక ఈ సినిమాలో హను రెడ్డి, అనంతిక జంటగా నటిస్తుండగా.. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తుండగా.. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శశాంక్ మాలి ఎడిటింగ్, అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.