కుబేర సెకండ్ సింగిల్ రిలీజ్

Kuberaa 2nd Single Released

నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు మేకర్స్. నిన్న రాత్రి చెన్నై లోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించగా.. దీనికి చిత్ర యూనిట్ మొత్తం హాజరయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రధానపాత్రలకు సంబంధించి పోస్టర్స్, గ్లింప్స్ ఫస్ట్ సాంగ్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో రిలీజ్ చేసిన టీజర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఇంప్రెస్ చేసింది.

ఈ తరుణంలో ఈ అంచనాలను రెట్టింపు చేసేలా కుబేర నుండి నేడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘అనగనగా కథ’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. హైడ్ కార్తీ, కరీముల్లా శ్రావ్యంగా ఆలపించారు. కాగా కుబేర చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి దేవి అద్భుతమైన ట్యూన్ అందించాడు. అయితే దేవితో శేఖర్ కమ్ముల పనిచేయడం ఇదే మొదటిసారి.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల క్యారెక్టర్ బేస్డ్ నేరేటివ్స్‌తో అదరగొట్టే నెవర్ బిఫోర్‌గా తీర్చిదిద్దారు. మొత్తానికి కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవనుందని టీమ్ పేర్కొంది.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల హోం బ్యానర్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.