సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా ఈనెల 30న రీ రిలీజైన విషయం తెలిసిందే.ఇక ఈసినిమా రీ రిలీజ్ సినిమాల్లోనే ఆల్ టైం రికార్డు సృష్టించింది.మూడు రోజుల్లో డబుల్ డిజిట్ గ్రాస్ కలెక్టన్స్ ను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన రీ రిలీజ్ మూవీ గా రికార్డుల్లోకి ఎక్కింది.ఫస్ట్ టైం రీ రిలీజ్ అవ్వగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.83కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అటు నార్త్ అమెరికాలో ఈసినిమా 100K డాలర్లకు పైగా రాబట్టి అక్కడ కూడా హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా మొదటి సారి రిలీజైన ఈసినిమాకు ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో సరైన ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేక చేతులెత్తేసింది.ఆ తరువాత టీవీల్లో టెలికాస్ట్ అయిన ప్రతిసారి మంచి రేటింగ్స్ ను రాబట్టుకుంది.ఇక ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు రీ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇందులో అనుష్క కథానాయికగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు.శింగనమల రమేష్ ,సి కళ్యాణ్ నిర్మించారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు ,ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా ఈసినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు.త్వరలోనైనా ఇస్తారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























