గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్.ఈసినిమా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.తెలుగులోకూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో శివ కార్తికేయన్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈసినిమా తరువాత నెక్స్ట్ ఈహీరో మదరాసి తో రానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో వస్తుంది.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.గత కొద్దీ రోజులుగా శ్రీలంకలో చివరి షెడ్యూల్ ను చిత్రీకరించారు.ఇందులో శివ కార్తికేయన్ ,విద్యుత్ జమ్వాల్ లపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.దీంతో షూటింగ్ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఈసినిమా ఏఆర్ మురగదాస్ కెరీర్ కి కీలకం కానుంది.గత కొంత కాలంగా సరైన విజయం లేక బాగా వెనుకపడిపోయాడు ఈడైరెక్టర్.రీసెంట్ గా సికందర్ తో కూడా విజయాన్నిఅందుకోలేకపోయాడు.మరి మదరాసి తోనైనా మురగదాస్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం తన 25వ సినిమా పరాశక్తి లో కూడా నటిస్తున్నాడు.సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























