తమిళ స్టార్ హీరో విజయ్ నుండి వస్తున్న చివరి సినిమా జయ నాయగన్.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.నిన్నటి తో తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.జూలై లో బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా లో తెలుగు సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి లోని ఓ ఎపిసోడ్ ను రీ క్రియేట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.అయితే సంక్రాంతికి తెలుగులో మెగా 157, అనగనగా ఒక రాజు సినిమాలు విడుదలకానున్నాయి.దాంతో ఒక వేళ జన నాయగన్ ను తెలుగులో విడుదలచేస్తే భారీ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి చేయడంతో పూర్తిగా పొలిటీషియన్ గా బిజీగా కానున్నాడు.ఇప్పటికే విజయ్ పార్టీ స్థాపించగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో తన పార్టీని దింపనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























