సంక్రాంతికి అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju release date announced

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి .ఈసినిమా తరువాత చేసిన జాతి రత్నాలు ,మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్లాక్ బాస్టర్ లు అయ్యాయి.అయితే సక్సెస్ వున్నా ఆలస్యంగా సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు ఈహీరో.జాతిరత్నాలు వచ్చి 5 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటివరకు మరో సినిమాను రిలీజ్ కాదు కదా పూర్తి కూడా చేయలేకపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈఏడాది కూడా నవీన్ నుండి సినిమా రావడం లేదు.ప్రస్తుతం నవీన్ అనగనగా ఒక రాజు చేస్తున్నాడు.రెండు నెలల ముందే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. దాంతో దీపావళి వరకు రిలీజ్ అవుతుందనుకుంటే ఏకంగా సంక్రాంతికి వెళ్ళిపోయింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.సంక్రాంతికి 14న రిలీజ్ కానుంది.అనిల్ రావిపూడి -మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా సంక్రాంతికే రానుంది.అయితే డేట్ లాక్ చేయలేదు.సో ఇప్పటివరకు అయితే టాలీవుడ్ నుండి ఈ రెండు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచాయి.

ఫ్యామిలీ కి సూట్ అయ్యే కంటెంట్ కావడంతో అనగనగా ఒక రాజును సంక్రాంతికి తీసుకొస్తున్నారు.ఇక ఆలస్యంగా వచ్చినా ఎంటర్టైన్ చేయడంలో మాత్రం నిరాశపరుచడు నవీన్. పైగా సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో అనగనగా ఒక రాజుపై మంచి అంచనాలు వున్నాయి.హిట్ టాక్ వస్తే పండుగ సీజన్ అడ్వాంటేజ్ కానుంది.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.