తమిళ హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖైదీ.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు తెలిపారు. ఖైదీని కూడా వీరే నిర్మించగా భారీ లాభాలు వచ్చాయి.ఇక ఖైదీ 2 ఎప్పుడు మొదలు కానుందని అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం ఇచ్చారు.కార్తీ ప్రస్తుతం వున్న కమిట్ మెంట్స్ పూర్తి కాగానే ఖైదీ 2 షూట్ స్టార్ట్ చేస్తాం.మోస్ట్లీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక లోకేష్ ప్రస్తుతం కూలీని పూర్తి చేసే పనుల్లో వున్నాడు.సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున , ఉపేంద్ర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఆగస్టు 14న విడుదలకానుంది. ఈసినిమా రిలీజ్ అయ్యాక లోకేష్, ఖైదీ 2 ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నాడు.
ఇక కార్తీ ప్రస్తుతం సర్దార్ 2లో నటిస్తున్నాడు.సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమాను పూర్తి చేసి నెక్స్ట్ మరో సినిమా చేయనున్నాడు కార్తీ.ఆ తరువాతే ఖైదీ 2లో జాయిన్ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























