భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇతిహాసిక చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో ‘రాకింగ్ స్టార్ యష్’ ఈ భారీ ప్రాజెక్టులో రావణుని పాత్రను పోషిస్తున్నాడు. హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్ యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గై నోరిస్ గతంలో ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సూసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన ‘రామాయణం’ కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం, భారతీయ పౌరాణిక గాథను ప్రపంచస్థాయిలో ఆవిష్కరించేందుకు రూపొందించబడుతోంది.
తాజాగా విడుదలైన సెట్స్ ఫోటోల్లో యష్ ఒక శక్తివంతమైన, యోధుడిగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన కటౌట్ చూస్తుంటే, రావణాసురుడి పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇది సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ ఇతిహాస చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) మరియు యాష్ (Monster Mind Creations) కలిసి నిర్మిస్తున్నారు.
అయితే యష్ ఈ సినిమాలో నటుడిగా మాత్రమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం. చిత్రీకరణ మొదలైనప్పటి నుంచే యష్ సృజనాత్మకంగా పూర్తిగా చొరవ చూపుతూ, ప్రతి అంశంలో భాగస్వామిగా మారారు. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. రామాయణంలోని రావణుడు అత్యంత శక్తివంతుడు. దీంతో అతడిని మరింత శక్తివంతంగా, కొత్త కోణంలో చూపించేందుకు యష్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. కాగా రామాయణం – పార్ట్ 1 దీపావళి 2026లో విడుదల కానుండగా, పార్ట్ 2 దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ సినిమాకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. అలాగే సినిమా ఫ్యాన్స్‌కు ఇది ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా మారనుంది!
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























