టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా ఈ లిస్టులోకి చేరింది. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రం త్వరలో రీరిలీజ్‌కి సిద్ధమవుతోంది. కాగా మరి కొద్ది రోజులలో ఎన్టీఆర్ బర్త్ డే రానున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యమదొంగ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సరికొత్త హంగులతో మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఎన్టీఆర్ జన్మదినం మే 20న కాగా, యమదొంగ సినిమాను మే 18వ తేదీన రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే 19, 20వ తేదీలలో కూడా థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. మైత్రీ అధినేత చెర్రి, ఊర్మిళ నిర్మాతలుగా, రమా రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘నాచోరే’ పాట ప్రోమో 4Kలో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే యమదొంగ రీరిలీజ్ కోసం మేకర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించడం గమనార్హం. యమదొంగ సినిమా ఒరిజినల్ ప్రింట్‌ను 8కేలో రీస్టోర్ చేశారు. తద్వారా భవిష్యత్తులో కూడా ఈ చిత్రాన్ని మళ్లీమళ్లీ విడుదల చేయడానికి అవకాశముంది.
ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 4Kలో స్పెషల్ షోస్ వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. కొత్త వర్షెన్‌లో విడుదల కానున్న యమదొంగ చిత్రాన్ని వీక్షించేందుకు జూనియర్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మే 9న బుకింగ్స్ ప్రారంభించనున్నారు.
కాగా ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో తారక్ సరసన ప్రియమణి, మమతా మోహన్ దాస్ నటించగా.. అర్చన, ప్రీతి జింగ్యానియా, నవనీత్ కౌర్ ప్రత్యేక పాత్రల్లో దర్శనమిచ్చారు. అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు యమధర్మరాజు పాత్రను పోషించారు. బ్రహ్మనందం, అలీ ముఖ్యపాత్రల్లో నటించారు. 2007లో విడుదలైన ఈ సోషియో ఫాంటసీ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































