సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. కింగ్ నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్, సత్య రాజ్ మలయాళ నటుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగావుంది. దీంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు మేకర్స్. ఇంతకుముందు రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే రజినీ బర్త్ డే సందర్భంగా ‘చీకిటు వైబ్’ పేరుతో విడుదలచేసిన స్పెషల్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక కూలీ ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. అంటే, మరో 100 రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా కౌంట్‌డౌన్ వీడియోను పంచుకుంది. కాగా సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఆగస్టు 14న ‘వార్ 2’ కూడా విడుదలకానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈ సినిమాకు భారీ హైప్ వుంది. దాంతో కూలీకి తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది. తమిళంలో మాత్రం వార్ 2 ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు.
ఇక రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ‘జైలర్’ కూడా ఆగస్టు నెలలోనే విడుదలైంది. మరి ఆ సెంటిమెంట్ కూలీకి కలిసొస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాకు వున్న హైప్ దృష్ట్యా తెలుగు రైట్స్‌కు నిర్మాత భారీ ధర చెప్తున్నారట. లోకేష్ కనగరాజ్ చేసిన చివరి రెండు చిత్రాలు ‘విక్రమ్, లియో’ తెలుగులోకూడా భారీ లాభాలను తీసుకొచ్చాయి. దాంతో కూలీ రైట్స్‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఇక ఇదిలావుంటే రజినీకాంత్ నెక్స్ట్ మూవీ ‘జైలర్ 2’ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘జైలర్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. నెల్సన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: