టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను తాజాగా లాంచ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ స్టూడియో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రారంభం అయింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఏఐ గురించి గత రెండేళ్లుగా డిస్కషన్ స్టార్ట్ చేశాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటం తో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్ లో సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్ గా డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్టు ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేవరకు ఒక స్టేజ్.”
“న్యూ కమ్మర్స్ కి ఇది చాలా యూజ్ ఫుల్ గా ఉంటుందని డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్ గా ప్రీ ప్రొడక్షన్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో సినిమా వాళ్ళకి తెలుసు. సెకండ్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. తర్వాత షూటింగ్ ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్. తర్వాత ప్రమోషన్స్. ఇలా స్టెప్ బై స్టెప్ గా డెవలప్ డెవలప్ చేయడం జరిగింది.”
“స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చేసే ప్రీ ప్రొడక్షన్ ని ఎఐ లో ఎలా చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అది చాలా మిరాకిల్ గా అనిపిస్తుంది. చాలామంది డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి దీని గురించి చూపించడం జరిగింది. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అప్రిషియేషన్ ఒక ఎనర్జీని ఇచ్చింది. స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ లో మనం హోమ్ థియేటర్ లో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా చూడొచ్చు.”
“అది మెయిన్ టార్గెట్. పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ ఏది అనుకుని సినిమాని తీశాడు ఫైనల్ కట్ సినిమా చూడొచ్చు. ఈ విషయంలో ముఖ్యంగా మూడు టార్గెట్స్ ఉన్నాయి. సక్సెస్ పర్సెంటేజ్ ని పెంచవచ్చు. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో డైరెక్టర్ కి టైం సేవ్ అవుతుంది. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్ కి టైం సేవ్ కావడం వల్ల మనీ సేవ్ అవుతుంది.”
“లోర్వెన్ AI అనేది ఎమోషన్ లేని ఒక ఫస్ట్ ఏడి గా భావించవచ్చు. ఇది డైరెక్టర్స్ కి క్రియేటివ్ సైట్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. మా సంస్థలో రూపొందుతున్న విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన’ సినిమా తీస్తున్న డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నాడు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షను ఇందులోనే జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళతో చేస్తున్న ‘తెల్ల కాగితం’ అనే సినిమా కూడా జరుగుతుంది.”
“అలాగే ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేయబోతున్నాం. దాని వర్క్ కూడా ఇందులోనే జరుగుతుంది. అలాగే ఒక స్క్రిప్ట్ ని కూడా ఇందులోనే డెవలప్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఉపయోగపడేలా డెవలప్ చేస్తున్నాం .ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ కాకుండా మిగతా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ ‘లోర్వెన్ AI’ కావాలనుకుంటే సంప్రదించొచ్చు. అందరికీ థాంక్యు వెరీ మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























