మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. రీసెంట్ గానే ఈ మెగా 157 మూవీ లాంచ్ కూడా అయ్యింది.అనిల్ రావిపూడి మార్క్ ఎంటరైనర్ గా తెరకెక్కనుంది.ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. అన్ని కుదిరితే ఈనెల 22 న ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. తొందరగానే సినిమాను పూర్తి చేయనున్నారు.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలనుకుంటున్నారట.త్వరలోనే ఈ హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనుండగా షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మించనునున్నారు.ఇందులో వింటేజ్ చిరును చూపించనున్నాడు అనిల్ రావిపూడి. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ఈసినిమాకన్నా ముందు చిరంజీవి, విశ్వంభరతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























