ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ ఎక్సయిట్మెంట్ని మరింత పెంచేస్తూ తాజాగా బ్లైండ్ స్పాట్ చిత్రం నుంచి ‘కనిపించేవన్నీ’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటకు డైరెక్టర్ రాకేష్ వర్మ మరియు ప్రకాష్ దాసరి సాహిత్యం అందించగా.. జెమీమా అద్భుతంగా ఆలపించారు. మొత్తానికి ఈ సాంగ్ మూవీపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.
కాగా బ్లైండ్ స్పాట్ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























