ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న మొదటి పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం అందుకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ చేసి బజ్ పెంచాలని చూస్తుంది చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమాతో ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రామ్.రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు .దీంతో ఈ 22వ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.హిట్ ఇచ్చిన దర్శకుడు, టాప్ ప్రొడక్షన్ హౌస్ ,క్రేజ్ వున్న హీరోయిన్ కాంబో లో సినిమా చేస్తున్న రామ్ కు హిట్ కొట్టడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























