అదుర్స్ 2 అందుకే చెయ్యట్లేదు – ఎన్టీఆర్

Jr NTR Gives Clarity About Adhurs 2 Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వున్నాయి. అవన్నీ ఆయనకు ఎంతో మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అయితే వాటిలో ఒక చిత్రం మాత్రం తారక్‌ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. అదే ‘అదుర్స్’ సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగలడని అనిపించుకున్నారు. ‘చారి’ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ మూవీకి సీక్వెల్ చేయాలని జూనియర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ టాలీవుడ్ స్టార్ హీరో దీనిపై స్పందించారు. నిన్న రాత్రి జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం సక్సెస్ మీట్‌కి చీఫ్ ప్ట్‌గా హాజరైన క్రమంలో ఎన్టీఆర్ తాను చేయబోయే తదుపరి సినిమాల లైనప్‌ని తెలియజేశారు.

ఈ సందర్భంగా తారక్ మాట్లాడూతూ.. “న‌వ్వించ‌డం పెద్ద వ‌రం. మ‌న‌ల్ని న‌వ్వించ‌డానికి క‌ళ్యాణ్ శంక‌ర్ దొరికాడు. ఈ సినిమాలో లడ్డు (విష్ణు )లేకపోతే సినిమా హిట్ అయ్యేది కాదేమో. తన ఇన్నోసెన్స్ చాలాబాగా పండింది. ఒక వయస్సు వచ్చిన తర్వాత ముఖంలో కామెడీ పలికించడం యాక్టర్‌కి చాలా కష్ట‌మైన ప‌ని. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి ఆలోచిస్తున్నాను” అని అన్నారు. ఇక ఎన్టీఆర్ మాటలను చూస్తే, అదుర్స్ సినిమాకి సీక్వెల్ రావడం కష్టమే అని ఆయన ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.

కాగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెర‌కెక్కిన అదుర్స్ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2010లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్స్ లో నటించగా.. అయన సరసన నయనతార, షీలా కౌర్ కథానాయికలుగా చేశారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.