టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో 5రోజుల్లో దాదాపు 75కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 100కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఒకరైన సంగీత్ శోభన్ అప్పుడే తన తదుపరి ప్రాజెక్టుని లైన్‌లో పెట్టేశాడు. దీనికోసం మెగా డాటర్ నిహారిక కొణిదెలతో చేతులు కలిపాడు. ఈ కొత్త సినిమాకి మానస శర్మ అనే యంగ్ అండ్ ట్యాలెంటెడ్ రైటర్ కం డైరెక్టర్ సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు నేడు నిహారిక నేతృత్వంలోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఇది వారికి రెండో సినిమా కాగా, అంతకుముందు ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిత్రం ఫస్ట్ ప్రాజెక్ట్. అది సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్‌తో తమ తరువాతి ప్రాజెక్టుని ప్రకటించడంతో, దీనిపై ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























