రికార్డు ధర పలికిన జన నాయగన్ ఓటిటి హక్కులు

Prime Video has acquired the OTT rights for Jana Nayagan

దళపతి విజయ్ జయ నాయగన్ హైప్ నెక్స్ట్ లెవెల్లో వుంది.సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ ,సాంగ్ కూడా బయటికి రాలేదు కానీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈసినిమా ఓటిటి హక్కులను అన్ని భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.121 కోట్లకు ప్రైమ్ ఈ డీల్ ను సెట్ చేసుకుందట.కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. అలాగే ఈసినిమా శాటిలైట్ హక్కులు 55 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.సన్ టీవీ ఈహక్కులను సొంతం చేసుకుంది. దాంతో నాన్ థియేట్రికల్ రూపంలో176 కోట్ల బిజినెస్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలుకనున్నాయి.ఇక చివరి సినిమా కావడంతో విజయ్ కూడా ఈసినిమాకు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాంతో బడ్జెట్ పెరిగిపోయింది.ప్రస్తుతానికి సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.జూన్ లోపు బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు.

ఈసినిమాను ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

అయితే జన నాయగన్ కు తెలుగులో మాత్రం భారీ పోటీ ఎదురుకానుంది.అదే డేట్ కి ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా రానుంది.ఈసినిమాతో పాటు సంక్రాంతికి చిరు అనిల్ తోపాటు మరి కొన్ని సినిమాలు విడుదలకానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.