లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చాడు తమిళ యంగ్ హీరో &డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాను తనే డైరెక్టర్ చేశాడు. లవ్ టుడే తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈసినిమా తరువాత ప్రదీప్ హీరోగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో నటించిన సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కేవలం 10 రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.తెలుగులోకూడా ఈ సినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.నిన్నటి వరకు 12 కోట్లకుపైగా వసూళ్లతో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.ఈసినిమాతో ప్రదీప్ వరుసగా రెండో సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.తమిళనాడులో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిస్థానంలో కొనసాగుతుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ ,కయదు లోహర్ హీరోయిన్లు గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత ప్రదీప్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తో రానున్నాడు.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.దీంతో పాటు తెలుగులో మైత్రి మూవీస్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రదీప్. తర్వలోనే ఆసినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























