తమిళ స్టార్ హీరో తల అజిత్ నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ తో రానున్నాడు.మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఆంతేకాదు అధిక్, అజిత్ కి వీరాభిమాని.టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళంలో మైత్రి కి ఇదే మొదటి సినిమా.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.కేవలం తమిళంలోనే వచ్చిన ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ను తెచ్చుకుంటుంది. 24గంటలు కుడా కాకముందే 27 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. 750k లైక్స్ క్రాస్ చేసింది.టీజర్ విషయానికి వస్తే వింటేజ్ అజిత్ ను పరిచయం చేశారు. తన ట్రేడ్ మార్క్ సీన్లను అజిత్ ఇందులో రిపీట్ చేశాడు.ఫ్యాన్స్ అయితే టీజర్ కట్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.చాలా సంవత్సరాల తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో అజిత్ నుండి ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుంది.
టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే డే 1 తమిళనాడులో ఈసినిమా ఆల్ టైం రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.తెలుగు టీజర్ ఒకటి లేదా రెండు రోజుల్లో రానుంది. ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: