బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్.నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ , విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి.టీజర్ లో క్లిక్ అయినట్లు సినిమాలో కూడా కామెడీ క్లిక్ అయితే 100 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది.ముందు మార్చి 29న రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే ఆ రోజు అమావాస్య కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఒక రోజు ముందుగానే 28న రిలీజ్ చేయనున్నామని నిన్న ప్రకటించారు.ముందు ఆ డేట్ ను నితిన్ రాబిన్ హుడ్ లాక్ చేసుకుంది.ఇప్పుడు అదే డేట్ కు మ్యాడ్ స్క్వేర్ వస్తుంది. ఈ సందర్బంగా నిర్మాత నాగవంశీ కేవలం డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకే సినిమాను ఒక రోజు ముందు రిలీజ్ చేస్తున్నామని ఇందులో వేరే ఉద్దేశం లేదని రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని ట్వీట్ చేశారు.
ఇక మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు మొదటి భాగం రావాల్సివుంది.అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడం తో ఆ డేట్ కు వచ్చేలా కనిపించడం లేదు.ఒకవేళ హరిహర వీర మల్లు చెప్పినట్లు అదే డేట్ కు వస్తే మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కాదని ఇంతకుముందే నాగవంశీ ప్రకటించాడు.
మ్యాడ్ స్క్వేర్ ను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటివరకు ఈసినిమానుండి వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.హారిక సూర్యదేవర ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.నాగవంశీ ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: